10, ఫిబ్రవరి 2019, ఆదివారం

శ్రీలలిత బ్లాగుకు స్వాగతం


శ్రీలలిత బ్లాగు కేవలం శ్రీలలితాపరాభట్టారికా అమ్మవారికి సంబంధించిన సాహిత్యం కోసం ప్రత్యేకించబడింది.

యథావిధిగా ఇది కూడా జనబాహుళ్యానికి అందుబాటులో ఉంచటం జరుగుతోంది.

నా శ్యామలీయం బ్లాగులో నిన్న (2-10-2019) నాడు లలితా TS గారు పంపిన ఒక మంచి వ్యాఖ్య ఈబ్లాగు ఆవిర్భావానికి కారణభూతమైనది. అమ్మదయవలనే ఆవిడ ఈవిధంగా అడగటమూ, ఆసమయంలో నేను కూడా నడిచే దేవుడు పుస్తకాన్నివెబ్ లో చదువుతూ ఉండటమూ అంతా అమ్మ సంకల్పమే అని నమ్ముతున్నాను. అందుకే ఆలస్యం చేయకుండా, లలిత గారికి ఆవిషయం నా సమాధానంగా తెలియజేసి ఈ బ్లాగును అమ్మ కోసం ప్రత్యేకంగా ప్రారంహించటం జరిగింది.

పాఠకుల సౌకర్యార్థం లలితగారితో జరిగిన సంభాషణను ఇక్కడ ఉంచుతున్నాను.

లలిత గారు:"శ్యామలీయం గారు! మీకు వీలైతే మీరెప్పుడో రాద్దామనుకుంటున్నట్టు ప్రస్తావించిన లలితా సహస్రనామాలకి అర్థాలు రాయగలరా, దయచేసి? మీకిప్పటివరకూ ఎప్పుడూ చెప్పే సందర్భం రాలేదు కానీ, మీ లలితా సహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక నాకు నిత్య పారాయణం. దానిని పోస్ట్ రూపంలో అందించిన మీకు వేవేల కృతజ్ఞతలు."
నేను: "అమ్మ ఆజ్ఞ. తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇప్పటివరకూ కంచిపరమాచార్యుల వారి గురించి నీలంరాజు వేంకట శేషయ్యగారి విరచించిన నడిచే దేవుడు పుస్తకాన్ని చదువుతున్నాను. ఇంతలో మీనుండి వర్తమానం. ఆనందంగా ఉంది. తప్పక ఈప్రయత్నం చేదాం."

అమ్మకు సంబంధించిన ఈబ్లాగులోని సర్వవిషయాలనూ అమ్మకు నివేదించుతూ వ్రాస్తున్నట్లే భావించి వ్రాయటం జరుగుతోంది. చదువరులు కూడా ఆవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదవటమూ, ముఖ్యంగా ఎవరైనా వ్యాఖ్యలు పంపేటప్పుడు తగినంత హుందాతనం ప్రదర్శించటమూ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయని సవినయంగా మనవి చేస్తున్నాను.

మొట్ట మొదట శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని నామావళికి వివరణను సులభశైలిలో అందించే ప్రయత్నం చేస్తున్నాను.

4 కామెంట్‌లు:

  1. లలితాసహస్రనామాలకి వ్యాఖ్యానం వ్రాయమని అడిగిన వెంటనే మన్నించినందుకు మీకెన్నో కృతజ్ఞతలు!

    రిప్లయితొలగించండి
  2. శ్యామలీయం గారూ! నమస్తే,
    నాకు నవరాత్రులలోనూ, ఇంకా వీలైనప్పుడు లలితా సహస్ర నామాలు చదువుకోవడం తప్ప, ఆ నామాల అర్ధాలు, అంతరార్ధాలు, పూజా విధివిధానాలు తెలియవు. మీ ఈ ప్రయత్నం నాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
    ఈ మహత్కార్యం ఆ అమ్మవారి దయతో నిర్విఘ్నంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. _/\_ అమ్మవారి నామాలు బాగా చెబుతున్నారండీ. నామాలు చదివేటపుడు కొంతైనా బుర్రలో ఉంటుంది నాలాంటిదానికి

    రిప్లయితొలగించండి